టేకులపల్లి, ఏప్రిల్ 19 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో గల పల్లవి వైన్ షాపులో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. వైన్‌షాప్ కిటికీ గ్లాసులు పగలగొట్టి, ఇనుప చువ్వలను తొలగించి దుండగులు మద్యం బాటిళ్లు, రూ.20 వేల నగదు అపహరించుకుపోయినట్లు నిర్వాహకులు తెలిపారు. ఫిర్యాదు మేరకు టేకులపల్లి సీఐ తాటిపాముల సురేశ్, ఎస్ఐ రాజేంద్ర వైన్‌షాపును పరిశీలించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.
Tekulapally : టేకులపల్లి పల్లవి వైన్‌షాప్‌లో చోరీ