కొత్తగూడెం అర్బన్, జూన్ 09 : కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు తీరుపై, కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్ల విభజన తీరు చాలా అస్తవ్యస్తంగా ఉందని బీజేపీ పట్టణాధ్యక్షుడు శీలం విద్యాసాగర్ అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్ పరిపాలనాధికారికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. డివిజన్ల విభజన అశాస్త్రీయంగా జరిగిందని, ప్రజల్లో నెలకొన్న అనుమానాలు, సందేహాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం పట్టణ ప్రధాన కార్యదర్శులు గుంపుల మహేశ్, కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు ఏమునోరి శివ కృష్ణ, గొడుగు శ్రీధర్ యాదవ్, పట్టణ ఉపాధ్యక్షుడు బానోత్ రాంబాబు నాయక్, కనకం నవీన్, జ్యోతి ప్రకాశ్, జిల్లా నాయకులు నోముల రమేశ్ పాల్గొన్నారు.