టేకులపల్లి, మే 05 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సింగరేణి ఏరియా జేకేఓసీలో 2008లో భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితుల సమస్య పరిష్కరించాలనీ బాధితులు కోరారు. సోమవారం బాధితులు మాట్లాడుతూ.. ఇల్లెందు పట్టణం జేకేఓసీ భూ నిర్వాసితులకు ఏడు సంవత్సరాలుగా సింగరేణిలో ఎలాంటి నష్టపరిహారం రాలేదన్నారు. తాత్కాలికంగా సింగరేణిలో ఖాళీగా ఉన్న క్వార్టర్స్ లోకి అప్పుడున్న సింగరేణి అధికారులు 30 ఫ్యామిలీలు పంపించి సమస్య పరిష్కారం అయ్యేవరకు ఉండాలని కోరారు. ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాకపోగా ప్రభుత్వం ఇప్పుడు ఆ క్వార్టర్స్‌ను తొలగించి 100 పడకల ఆస్పత్రి కడుతామని శంకుస్థాపన చేసినట్లు చెప్పారు.
వీరికి ఎలాంటి పరిష్కారం చూపకుండా నెలరోజుల నుంచి ఒక్కొక్కరిని ఖాళీ చేయిస్తూ కట్టుబట్టలతో గెంటివేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఇప్పుడు మిగతా 11 ఇండ్లలో ఉన్న వారి సామాన్లు బైటేసి పంపిస్తున్నట్లు చెప్పారు. ఓ ఇంట్లో కాలు విరిగిన బాధితుడు ఉండటంతో, ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలని అధికారులతో బాధితులు వాగ్వివాదానికి దిగారు. తమకు ఆశ్రయం చూపిస్తే ఖాళీ చేస్తమని బాధితులు పేర్కొన్నారు.
Tekulapalli : ‘జేకేఓసి నిర్వాసితుల సమస్య పరిష్కరించాలి’
Tekulapalli : ‘జేకేఓసి నిర్వాసితుల సమస్య పరిష్కరించాలి’