భద్రాద్రి కొత్తగూడెం, జూలై 01 : చిన్న వయస్సులోనే మొక్కలు నాటే అలవాటు అలవడడం హర్షనీయమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యాధికారి ఎస్.జయలక్ష్మి అన్నారు. మంగళవారం డాక్టర్స్ డే సందర్భంగా చుంచుపల్లిలో ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహన్తో కలిసి డీఎంహెచ్ఓ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నతనంలో వేల మొక్కలు నాటి రికార్డు సృష్టించిన ఈ చిన్నారిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని, ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత, మలేరియా ప్రోగ్రాం ఆఫీసర్ స్పందన పాల్గొన్నారు..