‘కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం’
కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఏఐటీయూసీ కొత్తగూడెం ఏరియా నూతన బ్రాంచ్ కార్యదర్శి జె.గట్టయ్య అన్నారు. గురువారం కొత్తగూడెం ఏరియా స్టోర్స్‌ను ఆయన సందర్శించి కార్మికులను కలిశారు.
– ఏఐటీయూసీ కొత్తగూడెం ఏరియా నూతన బ్రాంచ్ కార్యదర్శి జె.గట్టయ్య
రుద్రంపూర్, ఆగస్టు 13 : కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఏఐటీయూసీ కొత్తగూడెం ఏరియా నూతన బ్రాంచ్ కార్యదర్శి జె.గట్టయ్య అన్నారు. గురువారం కొత్తగూడెం ఏరియా స్టోర్స్‌ను ఆయన సందర్శించి కార్మికులను కలిశారు. నూతనంగా బ్రాంచ్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన గట్టయ్యకు ఏరియా స్టోర్స్ కార్మికులు ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా స్టోర్స్‌లో అవసరమైన మేరకు మ్యాన్ పవర్‌ను పెంచాలని, కార్మికులకు ప్లే డేలు, పీహెచ్‌డీలను పెంచడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. అనంతరం ఏరియా స్టోర్స్ డీజీఎం మైనేని శ్రీనివాసరావును గట్టయ్య మర్యాదపూర్వకంగా కలిసి కార్మికుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. స్టోర్స్‌లో పని పరిస్థితులు, సిబ్బంది కొరత, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో ఏఐటీయూసీ రాజీపడే ప్రసక్తే లేదని గట్టయ్య స్పష్టం చేశారు.
ఏరియా స్టోర్స్‌కు సంబంధించిన సమస్యలపై ఇప్పటికే అధికారులతో చర్చలు జరుపుతున్నామని, ఒక్కో సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు.కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం యూనియన్ నిరంతరం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.త్వరలోనే పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్,ఆర్.సి. హెచ్.పి పిట్ కార్యదర్శి సురేందర్,ఏరియా స్టోర్స్ పిట్ కార్యదర్శి,కమల్(శ్రీనివాస్) , ఎస్ & పి సి పిట్ కార్యదర్శి రాంబాబు ,నాయకులు రాజాలపూడి సాంబమూర్తి ,,అవినాష్,వేముల నరేష్, లికిత్,సాగర్,సురేష్,రాజేష్,మెయిన్,గావిని నాగరాజు, పడాల కృష్ణ,డి ఎల్ ఆర్ కార్మికులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

