భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 22 : పాల్వంచ పెద్దమ్మతల్లి గుడి పాలక మండలి ప్రమాణ స్వీకారం ఉద్రిక్తంగా మారింది. ప్రమాణ స్వీకారం జరిపించొద్దంటూ అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలో గల జగన్నాధపురంలో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి ఇటీవల నూతన పాలక మండలిని నియమించారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు చెరో కమిటీని వేసుకున్నారు. ఈ కమిటీలు స్థానికేతరుడికి పెద్దమ్మ గుడి చైర్మన్ పదవిని కట్టబెట్టడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
గతంలో కూడా ప్రమాణ స్వీకారం జరిగే సమయంలో యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు పాల్పడుతామని చెప్పడంతో ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేశారు. మళ్లీ అదే కార్యక్రమాన్ని మంగళవారం కొనసాగించే ప్రయత్నం చేయగా ప్రమాణ స్వీకారం వద్ద యువకులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు బందోబస్తు నడుమ ప్రమాణ స్వీకారం జరిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Jagannathpuram : పెద్దమ్మ గుడి పాలక మండలి ప్రమాణ స్వీకారంలో ఉద్రిక్తత