టేకులపల్లి, నవంబర్ 27: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల బీసీ సంఘాల ఐక్యత మండల కన్వీనర్ లక్కినేని సురేందర్ (Lakkineni Surender) అన్నారు. మండల కేంద్రంలోని బ్రహ్మంగారి ఆలయంలో శక్రవారం బీసీ సంఘాలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ… బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని, తక్షణమే రిజర్వేషన్లలో మార్పు చేయాలని ఆయన కోరారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లోని వార్డులో జనరల్ ఓటర్లు అధికంగా ఉన్న చోటు ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారని సురేందర్ మండిపడ్డారు. బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ కల్పించే వరకు ఎన్నికలు నిర్వహించొద్దని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల నాయకులు నర్సింగ్ లక్ష్మయ్య, తౌడోజు బిక్షమయ్య, అన్నారపు వెంకటేశ్వర్లు, సింగం రాజేశ్వరరావు, చిర్ర వెంకటయ్య, మెంతెన ప్రభాకర్, సంజీవరావు, నెల్లురి ప్రకాష్, ఆమెడ రేణుక, వీరన్న పాల్గొన్నారు.