పాల్వంచ, మే 21 : ఉపాధ్యాయులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ అన్నారు. బుధవారం పాత పాల్వంచ హై స్కూల్లో కొనసాగుతున్న జిల్లా స్థాయి జీవశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణా తరగతులకు ఆయన హాజరై సైబర్ క్రైమ్, పోక్సో, మానవ అక్రమ రవాణ చట్టాలపై అవగాహన కల్పించారు. లాటరీ తగిలిందని, బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామని, సీబీఐ ఆఫీసర్స్ అంటూ, వస్తువులు కస్టమ్స్ ఆఫీస్ లో ఉన్నాయంటూ వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మొద్దన్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కినట్లయితే తక్షణమే 1930కని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్స్ డైరెక్టరు పద్మలత, డిగ్రీ లెక్చరర్ డా.శ్రీదేవి, ప్రముఖ కవి సురేశ్‌బాబు, తోటమల్ల డీఆర్పీలు ఎడారి ప్రకాశ్, పరమయ్య, కమలాకర్, జయబాబు పాల్గొన్నారు.