పాల్వంచ, సెప్టెంబర్ 15 : మెరుగైన సమాజ నిర్మాణం జరగడానికి, అలాగే శాస్త్ర సాంకేతిక రంగాలన్నింటిలో కూడా ముందడుగు పడాలంటే కేవలం ఉపాధ్యాయుల ద్వారానే సాధ్యమవుతుందని పాల్వంచ మండల అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి అన్నారు. పాల్వంచ మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 21 మంది ఉపాధ్యాయులకు బొల్లూరుగూడెం ఉన్నత పాఠశాలలో సోమవారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అన్నింటికన్నా ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవమైందన్నారు. అటువంటి ఉత్తమ ఉపాధ్యాయులను ప్రతి ఏడాది సన్మానించుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఏ.శ్రీరామ్మూర్తి, మాధవరావు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు ప్రకాష్ రావు, పద్మలత, కుమారి, మంగమ్మ పాల్గొన్నారు.
జి.రత్నకుమారి, పి.కమలాకర్, వి.లక్ష్మి, బి.మాధవి, కె.కృష్ణమూర్తి, పి.అరుణ, బి.నాగ మహాలక్ష్మి, ఎస్.రామారావు, వి.ఉమారాణి, ఎం.సందీప్, బి.అనురాధ, కె.సుధాకర్, బి.శ్రీనివాసరావు, యు.ప్రవీణ్ కుమార్, పి.లీలా మాధురి, టి.శ్రీనివాస రెడ్డి, ఎ.వాత్సల్య, కె.పద్మజ, ఎన్.రాము, ఎండీ.షాజియా తబస్సుమ్, జె.రామ్ ప్రసాద్.
Palvancha : మెరుగైన సమాజం ఏర్పాటుకు ఉపాధ్యాయులే కీలకం : విజయభాస్కర్ రెడ్డి