ఇల్లెందు, జనవరి 21 : తెలంగాణ సిరుల తల్లి సింగరేణి రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమాలు, దందాలపై సిబిఐచే విచారణ జరిపించాలని టీబీజీకేఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిరసన, ధర్నా చేపట్టారు. ఇల్లెందు పట్టణం జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం ముందు టీబీజీకేఎస్ ఇల్లెందు ఏరియా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ జాఫర్ హుస్సేన్ అధ్యక్షతన బొగ్గు గనులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు నిరసన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజీబీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్.రంగనాథ్, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్, డిసిసిబి మాజీ డైరెక్టర్ లక్కినేని సురేందర్ పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సింగరేణికి అన్యాయం జరుగుతుందని గ్రహించి ఉద్యమం చేసి సాధించిన తెలంగాణలో సింగరేణి కార్మికులకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సింగరేణి అభివృద్ధి కోసం, కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి సింగరేణికి మంచి గుర్తింపు తెచ్చిన గొప్ప నేత కేసిఆర్ అన్నారు.
కేసీఆర్ ఆధ్వర్యంలో కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు నిర్వహించి కార్మికులను ఆదుకున్నట్లు తెలిపారు. అలాగే కార్మికులు కరెంట్ బిల్లు కట్టకుండా కార్మికులకు, కార్మికుల కుటుంబాలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి సింగరేణి అభివృద్ధి పథంలో నడిపించారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో సింగరేణికి, సింగరేణి ఉద్యోగులకు స్వర్ణ యుగంగా నడిచింది. కానీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు సింగరేణి అభివృద్ధి చేస్తాం, కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తామని, కొత్త గనులు తీసుకొస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే అప్పులు తెచ్చి జీతాలు ఇచ్చే దుస్థితికి తెచ్చారు అని దుయ్యబట్టారు. సింగరేణిలో ఎప్పుడు వినని చూడని రీతిలో సైడ్ విజిట్ అనే నిబంధనలు తెచ్చి బొగ్గు గనుల దోపిడీకి కొత్తరకంగా తెర లేపారని, ప్రస్తుతం దేశీయ బొగ్గు గనుల పరిశ్రమంలోనే నైనీ బ్లాక్ వ్యవహారం అతిపెద్ద కుంభకోణం దీనిపై సిబిఐ ద్వారా న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఇల్లెందు మాజీ కౌన్సిలర్లు కటకం పద్మావతి, చీమల సుజాత, తార, బీఆర్ఎస్ నాయకులు భూక్య దల్సింగ్, ఇల్లెందు పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ జబ్బర్, ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు అబ్దుల్ నబీ, ఇల్లెందు మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మం పార్టీ రేణుక, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ అజ్మీర బావుసింగ్, లకావత్ దేవీలాల్, బర్మావత్ లాల్ సింగ్, పట్టణ మహిళా అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి, సుదిమల్ల సర్పంచ్ కుంజ సుకనయ్య, చల్ల సముద్రం సర్పంచ్ యాపె శంకర్, మాజీ సర్పంచ్ తాటి మౌనిక, స్థానిక నాయకులు రవితేజ, కిరణ్, సునీల్ ,శ్రీకాంత్, లలిత కుమార్ పాసి, ఉపేందర్, వర రమేష్, గిన్నారపు రాజేష్, చాంద్ పాషా, కాసాని హరిప్రసాద్, రవికాంత్, రామ్ లాల్ పాసి, మదర్ బి, మౌనిక, సువర్ణపాక సత్యనారాయణ, భూక్య సురేష్, రమేష్, మునిగంటి శివ, వీరభద్రం పాల్గొన్నారు.

Yellandu : సింగరేణిలో కాంగ్రెస్ దందాలపై సీబీఐ విచారణ జరిపించాలి : టీబీజీకేఎస్ నాయకులు