పాల్వంచ నవంబర్ 23 : కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో స్వేరోస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ఆదివారం స్వేరోస్ ప్రతిజ్ఞ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా దమ్మపేట సెంటర్ నుంచి నటరాజ్ సెంటర్, అల్లూరి సెంటర్, అంబేద్కర్ సెంటర్ వరకు 2k రన్ ను స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షులు చిలకబత్తిని వీరయ్య ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద కేకును కట్ చేసి ప్రతిజ్ఞ దివస్ ను ఘనంగా నిర్వహించారు.
అనంతరం బస్టాండ్ సెంటర్ వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వీరయ్య, జిల్లా అధ్యక్షుడు జైభీమ్ రవీందర్, సీనియర్ స్వేరో తాళ్లూరి హరిబాబు, సీనియర్ స్వేరో ఇసనపల్లి నాగరాజు, జిల్లా జనరల్ సెక్రెటరీ రవి కిరణ్, జిల్లా ఉపాధ్యక్షులు వానపాకుల నాగరాజు, లాయర్ అశోక్, శేషు, రామ్ నివాస్, సాయిరాం, ఎస్.పుష్ప, లిఖిత, భావన, త్రివేణి, దీపిక, చందన పాల్గొన్నారు.