జూలూరుపాడు, ఆగస్టు 23 : సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకరరెడ్డి మరణం వామపక్ష, ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటు అని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి సభ్యుడు గుండెపిన్ని వెంకటేశ్వర్లు అన్నారు. సీపీఐ జూలూరుపాడు మండలం సమితి ఆధ్వర్యంలో సూరవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సురవరం నేతృత్వంలో పనిచేసిన ఆనేక మంది విద్యార్థి, యువజన నాయకులు తర్వాత కాలంలో వివిధ రాష్ట్రాల్లో రాజకీయ నాయకులుగా ఎదిగారన్నారు.
జాతీయ స్థాయిలో ఆయన ప్రసంగాలు మేధావులను ఆకట్టుకోవడమే కాకుండా, ఆయన ఆలోచనలు కొత్త తరాలకు మార్గదర్శమని అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష ఉద్యమాలకే కాకుండా తెలుగు ప్రజలకు కూడా తీరని లోటు అని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఎల్లంకి మధు, గార్ల పాటి వీరభద్రం, ఎస్కే చాంద్ పాషా, అనుమల అశోక్ కొండ వీరయ్య, నిమ్మ టూరి లచ్చయ్య, పత్తిపాటి మహేశ్, పానుగంటి మహేశ్, పసుపులేటి పవన్, తుమ్మ వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, లక్ష్మయ్య, సురేశ్ పాల్గొన్నారు.