చండ్రుగొండ, ఫిబ్రవరి 06 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం సీతాయిగూడెం వెంగలరాయ సాగర్ ప్రాజెక్టు అలుగు నిర్మాణాన్ని బీఆర్ఎస్ మండల కమిటీ శుక్రవారం పరిశీలించింది. ఈ సందర్భంగా అలుగు నిర్మాణ లోపాలను నాయకులు ఎత్తి చూపారు. నాసిరకం ఇసుక, యాష్ పౌడర్ని కలిపి నిర్మాణం కొనసాగించడం వల్ల నిర్మాణం త్వరగా దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కావునా ఈ నిర్మాణాన్ని ఆపి గోదావరి ఇసుకతొ మాత్రమే నిర్మాణం చేపట్టాలన్నారు. లేకపోతే ఆయకట్టు రైతులందరితో కలిసి ఆందోళన చేయనున్నట్లు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారా వెంకటేశ్వరావు (బాబు), ప్రధాన కార్యదర్శి, దామరచర్ల వైస్ సర్పంచ్ సంగొండి రాఘవులు, పార్టీ పట్టణాధ్యక్షుడు, 2వ వార్డు సభ్యుడు సూరా వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు మేడ మోహనరావు, నరుకుల్ల అప్పాజి, సత్తి నాగేశ్వరావు, మాజీ సర్పంచ్ పాండ్ల అంజనరావు, కేలోత్ శ్రీనివాస్, ఆయకట్టు రైతులు అచ్చన రాము, సానిక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Vengalaraya Sagar : నాసిరకంగా అలుగు నిర్మాణ పనులు