పాల్వంచ, మే 28 : పాఠశాల స్థాయిలో విద్యార్థులు మత్తు పదార్థాలైన సిగరెట్, గంజాయి వంటి మాదకద్రవ్యాల బారిన పడకుండా ఉపాధ్యాయులు వారిని చైతన్యవంతులను చేసి సన్మార్గంలో నడిచేలా చూడాలని ఎక్సైజ్ డీఎస్పీ కరంచంద్ అన్నారు. పాల్వంచ పట్టణంలోని కొమ్ముగూడెం ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న భౌతిక, రసాయన శాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణకు ఆయన హాజరై మాట్లాడారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్లల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులను క్రీడలు, సంగీతం, యోగా, చిత్ర లేఖనం వంటి ఆరోగ్యకరమైన చర్యల్లో పాల్గొనేలా చూడాలన్నారు.
కోర్స్ కో ఆర్డినేటర్ ఎస్కే. సైదులు మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మాదకద్రవ్యాల వినియోగం లేకుండా చూసేందుకు ప్రత్యేకంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిపి యాంటీ డ్రగ్ అవేర్నెస్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు, పాఠశాల స్థాయిలో మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన ఏ సమస్య తలెత్తిన కమిటీలు పరిష్కరించేలా వారిని చైతన్యవంతం చేయడం జరిగిందన్నారు. ఎక్సైజ్ సీఐ సాంబమూర్తి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉపాధ్యాయులకు మాదకద్రవ్యాల వినియోగం – కలిగే అనర్దాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రిసోర్స్ పర్సన్లు ప్రభు సింగ్, సంపత్ కుమార్, శంకర్, మోహన్ కుమార్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Palvancha : విద్యార్థులు సన్మార్గంలో నడిచేలా చూడాలి : ఎక్సైజ్ డీఎస్పీ కరంచంద్