అటవీ చెక్ పోస్ట్ విధులు మరిచిన సిబ్బంది
అటవీ శాఖ సిబ్బంది విధులను గాలికి వదిలి పట్టపగలే నిద్రకు ఉపక్రమించిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ అటవీ చెక్‌పోస్టులో శనివారం చోటుచేసుకుంది. మోరంపల్లిబంజర్‌లో అటవీ తనిఖీ కేంద్రంలో పని చేస్తున్న గార్డు పట్టపగలే నిద్ర పోవడంతో ఈ విషయం కాస్తా బహిర్గతమైంది.
– విధుల సమయంలో సిబ్బంది గాఢనిద్ర
బూర్గంపహాడ్, జూన్ 13 : అటవీ శాఖ సిబ్బంది విధులను గాలికి వదిలి పట్టపగలే నిద్రకు ఉపక్రమించిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ అటవీ చెక్‌పోస్టులో శనివారం చోటుచేసుకుంది. మోరంపల్లిబంజర్‌లో అటవీ తనిఖీ కేంద్రంలో పని చేస్తున్న గార్డు పట్టపగలే నిద్ర పోవడంతో ఈ విషయం కాస్తా బహిర్గతమైంది. చెక్‌పోస్టు పర్యవేక్షణ బాధ్యత చూడాల్సిన ఎఫ్బీఓ అక్కడ లేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది గార్డును ఉంచి వెళ్లడంతో ఆ వ్యక్తి విధుల సమయంలో నిద్రపోతూ ఆ శాఖ పనితీరును చాటి చెప్పాడు. నిత్యం వందలాది వాహనాలు ఈ చెక్‌పోస్టు మీదుగా వెళ్తున్నా సిబ్బంది సకాలంలో వాటిని తనిఖీ చేయడం లేదనే వాదనలూ లేకపోలేదు. ఇక్కడ పని చేస్తున్న అటవీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పనితీరు చెక్‌పోస్ట్ తనిఖీలో సరిగా లేదనే వాదనలూ లేకపోలేదు. గార్డు 24 గంటలూ విధులు నిర్వహించాల్సి ఉండగా ఇలా పట్టపగలు నిద్ర పోతున్నాడంటే దానికి ఆటవీశాఖ అధికారుల పర్యవేక్షణ లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ ఉన్నతాధికారులు చెక్‌పోస్టు విధుల విషయంలో ఇక్కడి సిబ్బంది పనితీరును ఆరాతీసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

