జూలూరుపాడు, మే 19 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు తాసీల్దార్గా తూమాటి శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన భద్రాచలం తాసీల్దార్గా విధులు నిర్వహించారు. బదిలీల్లో భాగంగా జూలూరుపాడు తాసీల్దార్గా విధుల్లో చేరారు. ఇక్కడ పని చేసిన తాసీల్దార్ స్వాతి బిందు బదిలీపై కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు.