రుద్రంపూర్, జనవరి 21 : కార్మికుల మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరమని, అదే స్ఫూర్తితో ఉత్పత్తి, భద్రత రంగాల్లో మెరుగుదల సాధ్యమవుతుందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. మంగళవారం రాత్రి కొత్తగూడెం ఏరియాలోని ఆర్సిఓఏ క్లబ్ WPS & GA వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం 2025–26 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన వివిధ క్రీడా పోటీలకు సంబంధించిన వార్షిక నివేదికను హానరరీ సెక్రటరీ సభకు తెలియజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. కార్మికుల్లో టీమ్ స్పిరిట్ పెంపొందించడంలో క్రీడల పాత్ర కీలకమన్నారు. సింగరేణిలో యువత అధిక సంఖ్యలో ఉందని, క్రీడల పట్ల ఆసక్తి పెంచేలా వెటరన్ క్రీడాకారులు, కో-ఆర్డినేటర్లు కార్మికులను ప్రోత్సహించాలని సూచించారు.
కంపెనీ స్థాయిలో కొత్తగూడెం ఏరియా అధిక సంఖ్యలో బహుమతులు గెలుచుకుని, కోల్ ఇండియా స్థాయిలో ప్రతిభ చాటినందుకు క్రీడాకారులను అభినందించారు. డిపార్ట్మెంటల్ క్రీడలను పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించిన అధికారులను, WPS & GA టీమ్ సభ్యులను ప్రత్యేకంగా ప్రశంసించారు. అనంతరం కోల్ ఇండియా స్థాయిలో బాడీ బిల్డింగ్ విభాగంలో గోల్డ్ మెడల్స్ సాధించిన ఎం.రామకృష్ణ, అసిస్టెంట్ చైర్మన్, జేవిఆర్ ఓసి-II ను శాలువాతో సత్కరించి చెక్కులను అందజేశారు. అలాగే డిపార్ట్మెంటల్ క్రీడల్లో విజయం సాధించిన క్రీడాకారులకు బహుమతుల ప్రధానం చేశారు. సేవా సభ్యులు, అధికారులు కూడా ఈ సందర్భంగా బహుమతులు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో జీఎంతో పాటు ఏఐటీయూసీ యూనియన్ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జక్కుల గట్టయ్య, ఐఎన్టీయూసీ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఎం.డి.రజాక్, ఏరియా అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఎం.వి.నరసింహారావు, ఎస్ఓటు జీఎం జి.వి.కోటిరెడ్డి, ఏజీఎం (పర్సనల్) జి.వి.మోహన్ రావు, అధికారులు ఉపేంద్ర బాబు, అజ్మీరా శ్రీనివాస్, జి. హరీష్, ఎం.మురళీ, యూ.అభిలాష్, స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ భూక్యా భీముడు, జనరల్ కెప్టెన్ బి.వెంకటేశ్వర్లు, స్పోర్ట్స్ మెంబర్స్ సి.హెచ్.సాగర్, కె. శ్రీనివాసరెడ్డి, ఎన్.వెంకటేశ్వర్లు, ఏ.మహేశ్ పాల్గొన్నారు.

Rudrampur : కార్మికుల్లో టీమ్ స్పిరిట్ పెంపునకు క్రీడలు దోహదం : జీఎం శాలెం రాజు