– చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు
బూర్గంపహాడ్, మే 05 : రాష్ట్రంలో గతంలో బాధ్యతలు తీసుకున్న సొసైటీ పాలకవర్గాలు తిరిగి పాలకవర్గాన్ని కొనసాగించాలని ఆదేశించడంతో ప్రభుత్వం చేసిన సూచన మేరకు బూర్గంపహాడ్ మండలంలో పీఏసీఎస్ పాలకవర్గాన్ని తిరిగి కొనసాగించారు. మంగళవారం ఈ మేరకు సొసైటీ చైర్మన్ గా బిక్కసాని శ్రీనివాసరావు పాలకవర్గ సభ్యులతో కలిసి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో రైతులకు సొసైటీ ద్వారా అన్ని సదుపాయాలు కల్పించాలని, వ్యవసాయపరంగా రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనవద్దని, కొనుగోలు కేంద్రాల్లో వారికి సకల సదుపాయాలు కల్పించాలని పాలకవర్గానికి, సొసైటీ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో సొసైటీ సీఈఓ ప్రసాద్, సిబ్బంది తిరుపతిరెడ్డి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.