చుంచుపల్లి, మే 08 : అవకాశం ఉన్న ప్రతి స్టేట్ బ్యాంక్‌లోనూ ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని ఎస్బీఐ కొత్తగూడెం రీజినల్ మేనేజర్ సత్యనారాయణ అన్నారు. రుద్రంపూర్‌లోని ఎస్బీఐ బ్యాంక్ ఆవరణలో గురువారం ఇంకుడు గుంతకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. భూగర్భ జలాల పరిరక్షణకు ఇంకుడు గుంతలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. నీటి వనరుల సంరక్షణ భావి తరాలకు శ్రీరామ రక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ఈశ్వర్రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, హెచ్.ఆర్. మేనేజర్ రాములు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.