ఇల్లెందు, అక్టోబర్ 18 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పించాలనే డిమాండ్‌తో శనివారం చేపట్టిన బంద్ ఇల్లెందులో సజావుగా కొనసాగుతుంది. ఇల్లెందు పట్టణంలో బీసీ కుల సంఘాలు, అధికార, ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు వారి వారి పార్టీల జెండాలతో జగదాంబ సెంటర్‌కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బీసీలకు న్యాయం చేయాలి, రిజర్వేషన్ కల్పించాలంటూ నినాదాలతో జగదాంబ సెంటర్ నుండి పాత బస్టాండ్, బొగ్గు వాగు బ్రిడ్జి మీదుగా కొత్త బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
Yellandu : ఇల్లెందులో సజావుగా బంద్