iBomma Ravi | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): సినిమాల పైరసీ కేసులో నిందితుడు ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవికి హైకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. అరెస్టయిన 90 రోజుల తర్వాత కూడా పోలీసులు చార్జిషీట్ వేయకపోవడంతో బెయిల్ మంజూరు చేసింది.
‘పిటిషనర్ రూ.25 వేల వ్యక్తిగత బాండ్ సమర్పించాలి. అంతే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలి. పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసేవరకు రోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల్లోగా ఎస్హెచ్వో ఎదుట హాజరుకావాలి’ అని కోర్టు షరతులు విధించింది.