Viral Video | ఇదేం నిరసనరా బాబు.. భాష్ప వాయువు ప్రయోగించిన పోలీసులు.. రెయిన్ డ్యాన్స్ చేసిన స్టూడెంట్స్
Viral Video : పోలీసులు ఆందోళనకారులపై భాష్పవాయువు ప్రయోగిస్తే.. కొందరు విద్యార్థులు దాన్ని రెయిన్ డీజేగా భావించి డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Viral Video : నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బిహార్‌లో కూడా బుధవారం వివిధ రాజకీయ పక్షాలకు చెందిన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. బిహార్ రాజధాని పాట్నాలో కూడా విద్యార్థులు, యువత భారీ ఎత్తున నిరసన చేపట్టారు. అయితే, ఈ సందర్భంగా జరిగిన పరిణామం ఆసక్తికరంగా మారింది.
పోలీసులు ఆందోళనకారులపై భాష్పవాయువు ప్రయోగిస్తే.. కొందరు విద్యార్థులు దాన్ని రెయిన్ డీజేగా భావించి డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుధవారం విద్యార్థులు పాట్నాలో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే, అక్కడ ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది. విద్యార్థులు ఉక్కపోత, చెమటతో అల్లాడిపోయారు. దీంతో ఆ విద్యార్థులే.. తమ కోసం సిద్ధం చేసిన వాటర్ కెనాన్లు ప్రయోగించాల్సిందిగా పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు విద్యార్థులపై వాటర్ కెనాన్లు ప్రయోగించారు. ఈ వాటర్ కెనాన్ల ప్రభావానికి అక్కడినుంచి వెళ్లిపోవాల్సిన విద్యార్థులు హాయిగా ఆ నీటిలో తడిశారు.
In Patna, Bihar, the police used water cannons on the protesters… and the protesters started dancing, singing, and enjoying a shower. 🫶😂😂 pic.twitter.com/sVNZ8pYBmy
— زماں (@Delhiite_) July 22, 2026
ఎంజాయ్ చేశారు. తమపై పడుతున్న నీటిని రెయిన్గా భావించి డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. డీజే పాటలతో ఆ ప్రాంతం సందడిగా మారింది. ఉద్యమం కాస్తా ఎంటర్టైన్మెంట్ ఈవెంట్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు మీమ్స్, ఫన్నీ జోక్స్‌తో రెస్పాండ్ అవుతున్నారు. అయితే, ఈ ఘటనపై పోలీసులు స్పందించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

