Rajasthan : దేశీయంగా తయారైన లాంగ్ రేంజ్ అటాక్ డ్రోన్ కాల్ (కేఏఎల్) పరీక్ష విజయవంతమైంది. రాజస్తాన్, పోఖ్రాన్‌లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరిపిన ప్రయోగం విజయవంతమైందని తయారీ సంస్థ ఐడీ డిఫెన్స్ వెల్లడించింది. నోయిడాకు చెందిన ఐజీ డిఫెన్స్ సంస్థ ఈ డ్రోన్‌ను తయారు చేసింది. ఇది దేశీయంగా, స్వదేశీ టెక్నాలజీతో తయారైన లాంగ్ రేంజ్ వన్ వే అటాక్ డ్రోన్.
ఇటీవలి కాలంలో ఈ తరహా డ్రోన్ల వినియోగం ఎక్కువగా పెరుగుతోంది. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో, ఇరాన్ యుద్ధంలో ఈ తరహా డ్రోన్లను వాడారు. షాహెద్-36 పేరుతో ఇరాన్, గెరాన్-2 పేరుతో రష్యా ఇలాంటి డ్రోన్లను రూపొందించారు. ఇవి తక్కువ ఖర్చుతోనే తయారవుతాయి. కాల్ డ్రోన్.. దాదాపు 1,000 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంది. 7-8 గంటలపాటు దూసుకెళ్లే సామర్ధ్యం ఉంది. 50 కేజీల పే లోడ్‌ను మోసుకెళ్లగలదు.
ఇది 5,000 మీటర్ల ఎత్తులో ఎగరగలదు. అంటే సముద్ర మట్టానికి పైనే. ఇది మల్టీ బ్యాండ్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్), ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్స్ (ఐఎన్ఎస్) ద్వారా స్వతంత్రంగా పని చేస్తాయి. ఈ డ్రోన్లు నిర్ణీత లక్ష్యాలను చేధించగలవు. నిర్మాణాలు, రాడార్ ఇన్స్టలేషన్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, వ్యూహాత్మక లక్ష్యాలపై దాడి చేయగలవు.