నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జాతిపిత, తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 72వ పుట్టిన రోజు వేడుకలు ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు, వివిధ వర్గాల ప్రముఖులు కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తమ అభిమాన నేతకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పల్లె నుంచి పట్నం దాకా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్‌కు ఇష్టమైన హరితహారంలో భాగంగా పలువురు నేతలు, కార్యకర్తలు పలుచోట్ల మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు. రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, దవాఖానల్లో రోగులకు పండ్లు, ఫలహారాల పంపిణీ చేస్తూ పుట్టినరోజు వేడుకల్లో భాగస్వాములయ్యారు.
జిల్లా, మండల పార్టీ కార్యాలయాల్లో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. నల్లగొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణుల సమక్షంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులం తా కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రస్థానం, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తదితర అంశాలకు సంబంధించిన పుస్తకాలను పార్టీ శ్రేణులకు పంపిణీ చేశారు. దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పార్టీ నేత లు, కార్యకర్తలు ఇందులో భాగస్వాములు కాగా, ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ గులాబీ కండువాలు కప్పి రవీంద్రకుమార్ సాదరంగా ఆహ్వానించారు. నార్కట్‌పల్లిలో పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యం లో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. కేక్‌కట్ చేసి స్వీట్లు పంచి పట్టారు. నకిరేకల్ ముఖ్యకూడలిలోనూ పెద్ద సంఖ్యలో పార్టీ నేత లు, కార్యకర్తలతో కలిసి చిరుమర్తి లింగయ్య కేసీఆర్ బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మిర్యాలగూడలో ని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేట్‌కట్ చేశారు. ఇం దులో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, పార్టీ రాష్ట్ర నేత నల్లమోతు సిద్ధార్థ, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుర్రంపోడులో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణు లు రక్తదాన శిబిరం నిర్వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ రక్తదానం చేశారు. అనంతరం కేట్ కట్ చేసి సం బురాలు నిర్వహించారు. హాలియాలోనూ పార్టీ శ్రేణులతో నోముల భగత్ ఘనంగా కేసీఆర్ బర్త్‌డే వేడుకలు జరిపారు. కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
భువనగిరిలోని పార్టీ కార్యాలయంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మె ల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జిల్లా అ ధ్యక్షుడు కంచ ర్ల రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేశారు. కేసీఆర్ లాంగ్‌లీవ్ అంటూ నినాదాలు చేస్తూ ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. బీబీనగర్‌లో జరిగిన వేడుకల్లోనూ పైళ్ల శేఖర్‌రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. ఆలేరులో మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీతామహేందర్‌రెడ్డి కేసీఆర్ బర్త్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా దవాఖానలో పేదలకు పండ్లు పం పిణీ చేశారు. సూర్యాపేట, తిర్మలగిరిల్లోనూ పార్టీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.కేసీయా రే తెలంగాణకు శ్రీరామ రక్ష అంటూ…సం పూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు వర్ధిల్లాలని పార్టీ నేతలంతా ఆకాంక్షించారు.