ఇల్లెందు, జూన్ 09 : సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇవ్వాలనే డిమాండ్‌తో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు బీఆర్ఎస్ నాయకుడు దిండిగాల రాజేందర్ తెలిపారు. తలాపున గోదావరి నది పారుతున్నా జిల్లాకి చుక్క నీరు రాకుండా మైదాన ప్రాంతానికి, మిగిలిన నీరు ఆంధ్రా ప్రాంతానికి తరలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు పిలుపు మేరకు బీఆర్ఎస్ ఇల్లెందు పట్టణ, మండల నాయకుల ఆధ్వర్యంలో ఇల్లెందు పట్టణంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తాసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నది ఉంది, ఆ నదిపై సీతారామ ప్రాజెక్ట్ నిర్మించిన బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో 100 కిలోమీటర్ల మేరకు కాల్వ నిర్మించింది.
తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నీళ్లు రాకుండా మైదాన ప్రాంతానికి, ఆంధ్రా ప్రాంతానికి నీళ్లు తరలించుకపోతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోరుతూ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పరుచూరి వెంకటేశ్వర్లు, శీలం రమేశ్, సిలివేరి సత్యనారాయణ, జెకె శ్రీను, తోట లలిత శారద, రంగనాథ్, దేవిలాల్, లాల్ చందు, దేవ్ సింగ్, నబి, రాజేశ్, మహేందర్, సత్యనారాయణ, సరిత పాల్గొన్నారు.
Yellandu : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు సీతారామ ప్రాజెక్ట్ నీళ్లివ్వాలి : దిండిగాల రాజేందర్
Yellandu : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు సీతారామ ప్రాజెక్ట్ నీళ్లివ్వాలి : దిండిగాల రాజేందర్