రామవరం, సెప్టెంబర్ 18 : జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో బహుమతులు గెలుచుకోవాలని, సింగరేణి సంస్థ పేరు నిలబెట్టాలని రెస్క్యూ టీమ్‌ను కొత్తగూడెం ఏరియా జీఎం శాలెం రాజు కొనియాడారు. జోనల్ మైన్స్ రెస్క్యూ కాంపిటీషన్స్ -2025 మైన్స్ రెస్క్యూ స్టేషన్ రామగుండం (ఆర్జి-2) లో ఈ నెల సెప్టెంబర్ 10 & 11వ తేదీల్లో జరిగాయి. ఈ పోటీలకు సింగరేణి వ్యాప్తంగా 6 మెన్ రెస్క్యూ టీమ్, 2 విమెన్ రెస్క్యూ టీమ్ లు పాల్గొన్నాయి. వాటిలో కొత్తగూడెం రీజన్ రెస్క్యూ టీమ్ బెస్ట్ ఫస్ట్ ఎయిడ్ ఈవెంట్ ప్రైజ్ సాధించింది.
ఉమెన్స్ టీమ్ లలో కొత్తగూడెం ఏరియా నుండి మౌనిక, కృష్ణవేణి, చందన జావేరీ, గాయత్రి పాల్గొని సత్తా చాటారు. మౌనిక టీమ్ ఓవరాల్ 1st ప్లేస్ సాధించింది. బెస్ట్ కెప్టెన్ గా కృష్ణవేణి నిలిచింది. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం జి.వి కోటిరెడ్డి, ఏజిఎం (సివిల్) సీహెచ్ రామకృష్ణ, డీజీఎం(పర్సనల్) జి.వి.మోహన్ రావు, ఎస్ఓఎం ఎన్విరాన్మెంట్ టి.సత్యనారాయణ, ఐటీ మేనేజర్ కె.శేషశ్రీ, రెస్క్యూ ఇన్చార్జి అనంతరామయ్య, మధుకర్, బ్రిగేడ్ మెంబర్స్ పాల్గొన్నారు.