– ముఖ్య అతిథులుగా పాల్గొన్న జీఎం సెంట్రల్ వర్క్ షాప్ ఎం.దామోదర్ రావు, ఇల్లెందు ఏరియా జనరల్ మేనేజర్ వి.కృష్ణయ్య
ఇల్లెందు, డిసెంబర్ 11 : సింగరేణి సంస్థలో 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు- 2025 ఇల్లెందు ఏరియాలోని ఏరియా వర్క్ షాప్‌లో గురువారం జరిగాయి. ముఖ్య అతిథులుగా జీఎం సెంట్రల్ వర్క్ షాప్ ఎం.దామోదర్ రావు, ఇల్లెందు ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా రక్షణ జెండా ఆవిష్కరించారు. అధికారులు, ఉద్యోగులతో రక్షణ ప్రతిజ్ఞ చేయి౦చారు. జీఎం వి.కృష్ణయ్య మాట్లాడుతూ.. రక్షణ పక్షోత్సవాలంటే ఒక వారం రోజులు మాత్రమే కాదని, నిత్య జీవితంలో ఏ పని చేసినా రక్షణతో చేయాలన్నారు. వర్షాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, పని చేసేటప్పుడు రక్షణతో చేయాలన్నారు.
ఎన్.దామోదర్ రావు మాట్లాడుతూ.. ఇంటి నుండి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, వర్క్ ప్రారంభించే ముందు పి.వి.ఈ. కిట్టు ధరించి డిస్ట్రిబ్యూషన్ పాయింట్లో ప్రమాద నివారణ ప్రతిజ్ఞ ప్రతిరోజు చేయాలని, ఎస్.ఓపి. ఎస్.ఎం.పీ. ప్రతిరోజు ఆచరణలో ఉంచుకోవాలన్నారు. అనంతరం పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారికి అక్కడే బహుమతులు అందజేశారు. టెక్నీషియన్లకు, సూపర్వైజర్లకు, ఇన్చార్జిలకు వారు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

Yellandu : ఇల్లెందు సింగరేణి ఏరియా వర్క్‌షాప్ వార్షిక రక్షణ పక్షోత్సవాలు
ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్షన్ టీమ్ మెంబర్స్ ఈ. కృష్ణారెడ్డి, (ఈ ఎం) ఎస్.టిపిపి, జి.దామోదర్, ఎస్.ఈ.(ఇ&ఎం) సి.హెచ్.పి, ఇల్లెందు, డాక్టర్ బి.కళ్యాణ్, మెడికల్ సూపరింటెండెంట్, ఇల్లెందు ఏరియా, కె.సుధాకర్, ఫోర్మన్ ఎలక్ట్రికల్, జి.నాగసాయి సందీప్, ఎఫ్.ఎం.(మెకానిక్), వీరితో పాటు ఇల్లెందు ఏరియా ఇంజినీర్ నరసింహ రాజు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ భాను ప్రసాద్, ఏరియా వర్క్ షాప్ నాగరాజు నాయక్, ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి శ్రీనివాస్, ఐఎన్టీయూసీ పిట్ కార్యదర్శి మధు, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు, సేఫ్టీ కమిటీ కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు.

Yellandu : ఇల్లెందు సింగరేణి ఏరియా వర్క్‌షాప్ వార్షిక రక్షణ పక్షోత్సవాలు