రామవరం, జనవరి 02 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీ బస్సు అశ్వాపురం మండలం మొండికుంట వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కేఎల్ఆర్ బస్సు ప్రమాదంలో గాయపడ్డ పలువురు విద్యార్థులు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని అంతర్జాతీయ తైక్వాండో క్రీడాకారిణి, బీఆర్ఎస్ జిల్లా నాయకురాలు సింధు తపస్వి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి సరైన చికిత్స అందించాలని కోరారు.

Ramavaram : బస్సు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థులకు సింధు తపస్వి పరామర్శ