ఇల్లెందు, నవంబర్ 07 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రహదారులు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శుక్రవారం ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంప్ కార్యాలయ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు జిల్లాలోని రహదారులు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ ఇల్లెందు ఎమ్మెల్యే కార్యాలయ ముట్టడి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. వాహనాల మీద ట్యాక్స్‌లు పెంచి డబ్బులు గుంజుతున్న ప్రభుత్వం రోడ్లకు మరమ్మతులు చేయడంలో విఫలమైందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్నా రోడ్లమీద తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదని విమర్శించారు. జిల్లాలో డీఎంఎఫ్టీ నిధులు పుష్కలంగా ఉన్నా వాటిని రోడ్ల అభివృద్ధి వైపు మళ్లించకపోవడం శోచనీయం అన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే బాధ్యత తీసుకుని రోడ్లను వెంటనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, జీకే సెంటర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు టీబీజీకెఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్.రంగనాథ్, పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబి, టేకులపల్లి ఉపాధ్యక్షుడు సీమల సత్యనారాయణ, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ అజ్మీర బావుసింగ్, ఉద్యమ నాయకులు ఎర్రబెల్లి కృష్ణ, వసంతరావు, మునిగంటి శివ, లలిత్ కుమార్ పాసి, మూలగుండ్ల ఉపేందర్ రావు, పరకపల్లి రవిగౌడ్, రాంలాల్ పాసి, కడగంచి వీరస్వామి, రాచపల్లి శ్రీను, నారపకా యాకయ్య, సనా రాజేశ్, ప్రసాద్, కాసాని హరిప్రసాద్ యాదవ్, ఎస్ కే బీబీ, నూర్జాన్, మదర్ బి.శ్యామ్, సుందరగిరి శీను, తాండ్ర వంశి, పుచ్చకాయల ఉదయ్ కుమార్, సునీల్, శ్రీకాంత్, ఎం.చంటి, ఎం.డి.జాలిన్, ముత్తయ్య, గడ్డం వెంకన్న, చీమల శ్రీను, ఇమ్రాన్, శివ, ఇమ్రాన్ గోల్డ్ చిన్నారి, రసూల్, కమ్రు, కాజా, బాబా, విజయ్, రాజు నాగేశ్వరరావు, సాయి కుమార్, వీరు, శివ కృష్ణ, సత్యవతి, ముత్తమ్మ, నారాయణమ్మ, భాయమ్మ, ఈశ్వరమ్మ, సాయి, రాంబాబు, పట్టణ నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు.

Yellandu : ఇల్లెందు ఎమ్మెల్యే కార్యాలయ ముట్టడి