కొత్తగూడెం సింగరేణి, జూన్ 24 : సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని ఐఓబి బ్యాంక్ సింగరేణి బ్రాంచ్ ఎదుట గత పది రోజుల క్రితం ఒక పాన్ డబ్బా వెలిసింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా బడ్డీ కొట్టు డబ్బని తీసుకువచ్చి బ్యాంక్ ఎదుట పెట్టారు. పది రోజుల తర్వాత ఒక వ్యక్తి ఆ బడ్డీ కొట్టులో మిఠాయి దుకాణం తెరిచాడు. బ్యాంక్ ఎదుట ఎవరి అనుమతులు లేకుండా బడ్డీ కొట్టు పెట్టి మిఠాయి దుకాణం తెరిచినప్పటికీ సింగరేణి అధికారులు అడ్డుకోకపోవడం నిత్యం సింగరేణి అధికారులు ఎస్ అండ్ పిసి సిబ్బంది, ఎస్టేట్ సిబ్బంది తిరిగే ఐఓబి బ్యాంకు ఎదుట బడ్డీ కొట్టు పెడితే ఎవరూ స్పందించక పోవడం పలు అనుమానాలు వెల్లివెత్తుతున్నాయి.
సింగరేణి కార్మికులు ఎవరైనా వారు నివసించే క్వాటర్ లో షెడ్డు నిర్మించినా, అదనపు బాత్రూం నిర్మించినా, అసలు ఇంటి ముందు ఇసుక బ్లాకులు కనబడితేనే ఎస్ అండ్ పిసి సిబ్బంది అనేక ప్రశ్నలు అడిగి ఇబ్బందులకు గురి చేస్తుంటారు. హెడ్ ఆఫీస్ పక్కనే మెయిన్ హాస్పిటల్ ఎం.ఆర్.ఓ ఆఫీసుకు వెళ్లే రోడ్డు పక్కన బ్యాంక్ ఎదుట అనుమతులు లేకుండా అక్రమంగా బడ్డీ కొట్టు పెడితే ఎవరు కూడా అడ్డుకోకపోవడం వారి పనితనానికి నిదర్శనం. ఇప్పటికైనా సింగరేణి ఎస్టేట్ ఎస్ అండ్ పిసి అధికారులు స్పందించి ఐఓబి బ్యాంక్ ఎదుట కొట్టును తొలగించి, సింగరేణి స్థలం ఆక్రమణకు గురి కాకుండా చూడాలని కార్మికులు, కార్మిక సంఘం నాయకులు కోరుతున్నారు.