రామవరం, సెప్టెంబర్ 03 : కొత్తగూడెం ఏరియాను సౌత్ సెంట్రల్ రైల్వే ఐ.ఆర్.టి.ఎస్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ షిఫాలి కుమార్ బుధవారం సందర్శిం చారు. ఏరియా జీఎం ఎం.షాలెం రాజు ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా షిఫాలి కుమార్ ఏరియాలోని ఆర్.సి.హెచ్.పి జేవిఆర్ సిహెచ్పిల నందు రైలు సర్వీస్ ద్వారా బొగ్గు రవాణా గురించి షాలెం రాజుని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం జీ.వి. కోటిరెడ్డి, ఏరియా ఇంజినీర్ కె.సూర్యనారాయణ రాజు, ఆర్.సి.హెచ్.పి ఎస్ఈ (ఈ అండ్ ఎం) షైక్ కరీముల్లా, సంబంధిత రైల్వే అధికారులు పాల్గొన్నారు.
Ramavaram : షిఫాలి కుమార్ కొత్తగూడెం ఏరియా సందర్శన