అశ్వారావుపేట : దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు పట్టణంలో ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. నాయబ్రాహ్మణ బజారులో కొలువుదీరిన అమ్మవారి సన్నిదిలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతేకాకుండా రామాలయం వద్ద మండపంతో పాటు బీసీ కాలనీ, నందమూరినగర్, కాళింగుల బజార్, గుర్రాలచెరువు అమ్మవారి ఆలయాలలో నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి.