చుంచుపల్లి, మే 27 : చుంచుపల్లి మండలం ధన్బాద్ గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వచ్చిన భారీ గాలి దుమారం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. బలమైన ఈదురు గాలులకు ఓ భారీ చెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో 10 విద్యుత్ స్తంభాలు నేలకూలగా, మరికొన్ని స్తంభాలు విరిగిపోయాయి. అదేవిధంగా రెండు ట్రాన్స్ఫార్మర్లు కూడా కిందపడిపోయాయి. అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి మరమ్మతు పనులు ప్రారంభించారు. చెట్టు రోడ్డుకు అడ్డంగా పడడంతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం పంచాయతీ సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు కలిసి చెట్టును తొలగించే పనులు చేపట్టారు. సింగరేణి ప్రాంతం కావడంతో ఆ చెట్టు దగ్గరలో సింగరేణి విద్యుత్ వైర్లు ఉండడంతో సింగరేణికి సంబంధించిన ఎన్సీ క్వార్టర్స్, ఎర్రగడ్డ కొన్ని ప్రాంతాల్లో సింగరేణి ఎలక్ట్రికల్స్ సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

ధన్బాద్లో తీవ్ర గాలి దుమారం.. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం
ఈ ఘటన కారణంగా గౌతంపూర్, రుద్రంపూర్, ధన్బాద్ పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం 4 గంటల నుండి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సాయంత్రం 7 గంటల వరకు సమయం పట్టే అవకాశముందని డీఈ రంగస్వామి, ఏఈ లక్ష్మీనరసింహారావు తెలిపారు. లైన్మెన్లు కిషన్, సాంబశివరావు సంఘటనా స్థలంలోనే ఉండి మరమ్మతు పనులను పర్యవేక్షిస్తున్నారు.

ధన్బాద్లో తీవ్ర గాలి దుమారం.. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం