– ఏడూళ్లబయ్యారం సర్కిల్ సీఐ వెంకటేశ్వర్లు, కరకగూడెం ఎస్ఐ పీవీ నాగేశ్వరరావు
కరకగూడెం, జూలై18 : మారుమూల ఏజేన్సీలో వలస ఆదివాసీల అవసరాలను గుర్తించి రాబిన్ హుడ్ ఆర్మీ హైదరాబాద్ స్వచ్చంధ సంస్థ దాతల సహకారంతో అందిస్తున్న సేవలు, సహాయ సహకారాలు అభినందనీయమని ఏడూళ్లబయ్యారం సర్కిల్ సీఐ వెంకటేశ్వర్లు, కరకగూడెం ఎస్ఐ పీవీ నాగేశ్వరరావు కొనియాడారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని వలస ఆదివాసీ గ్రామాలైన నీలాద్రిపేటగండి, అశ్వాపురంపాడులోని 70 కుటుంబాలకు ఆ సంస్థ సభ్యులు దాతల సహకారంతో సమకూర్చిన సోలార్ లైట్లు, మహిళలకు చీరలు, నిత్యవసర సరుకులను సీఐ, ఎస్ఐ గ్రామస్తులకు పంపణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వలస ఆదివాసీలు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సమాజంలో ఉన్నతంగా ఎదగాలన్నారు. గ్రామస్తులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. తమ పిల్లలను ప్రతి ఒక్కరూ పాఠశాలకు పంపించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని తెలిపారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాబిన్ హుడ్ ఆర్మీ స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

‘రాబిన్ హుడ్ ఆర్మీ సేవలు అభినందనీయం’