పారిశ్రామికవాడ సారపాకలో వరుస చోరీలు
బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామికవాడ సారపాకలో వరుస చోరీలు చోటుచేసుకుంటున్నాయి. సారపాకలో ఐరన్షాపులో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడటంతో..
బూర్గంపహాడ్, ఏప్రిల్ 03 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామికవాడ సారపాకలో వరుస చోరీలు చోటుచేసుకుంటున్నాయి. సారపాకలో ఐరన్షాపులో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడటంతో రూ.30 వేలు నగదు చోరీకి గురైనట్లు బాధితుడు భూమా వెంకటచంద్రశేఖర్రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మేడే కాలనీలోని ఓ ఇంటి తాళాన్ని దొంగలు పగులగొట్టి బీరువాలో ఉన్న సుమారు రూ.76 వేలు అపహరించినట్లు సమాచారం. అయితే ఆ ఇంటి యజమాని కేరళకు వెళ్లడంతో దొంగలు పథకం ప్రకారమే ఈ చోరీ చేశారని స్థానికులు చెబుతున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి క్లూస్ టీమ్ ద్వారా వేలిముద్రలు సేకరించారు. అంతేకాకుండా సారపాకలో ఇటీవల నూతనంగా నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లో కూడా దొంగలు ట్యాప్‌లు, వాష్ బేసిన్ ఎత్తుకెళ్లినట్లు స్థానికులు చెప్పారు. సారపాకలో వరుస దొంగతనాల నేపథ్యలో పోలీసులు నిఘా ఏర్పాటు చేసి చోరీలకు పాల్పడిన వారిని పట్టుకోవడంతో పాటు ఈ ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేయాలని, రాత్రి సమయాల్లో పోలీస్ పెట్రోలింగ్ విస్తృతంగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

