Science Expo | భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 13 : ఈనెల 15వ తేదీన కొత్తగూడెంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో తొలి అడుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ ఎక్స్ పో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, జిల్లా సైన్స్ అధికారి ఎస్ చలపతి రాజు తెలిపారు. ప్రతీ ఏడాది తొలి అడుగు ఆధ్వర్యంలో సైన్స్ ఎక్స్పో కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈ ఏడాది సైన్స్ ఎక్స్ నాలుగు ప్రధాన అంశాలపై ఎగ్జిబిషన్ ఉంటుంది.
1 వ్యవసాయము, ఆరోగ్యం ఆహారము 2 ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ 3. ఎన్విరాన్మెంట్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్, 4 సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనే ప్రదాన అంశాల పైన మాత్రమే తమ ఎగ్జిబిట్స్ ను రూపొందించుకొని ప్రదర్శించాల్సి ఉంటుంది.
పోటీలో పాల్గొనాలంటే..
ఈ పోటీలలో ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల, ఆశ్రమ, మైనార్టీ, కేజీబీవీలు అన్ని పాఠశాలలు ఈ పోటీలలో పాల్గొనవచ్చు. ప్రతి పాఠశాల నుంచి తప్పనిసరిగా కనీసం నాలుగు ఎగ్జిబిట్స్ అయినా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఒకరోజు నిర్వహించే ఈ ఎక్స్ పోకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. విజేతలకు నగదు బహుమతి, మెమెంటో, సర్టిఫికెట్ అందజేయబడుతుంది.
గతంలో సైన్స్ ఫెయిర్, ఇన్స్పైర్ పోటీలలో ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ ను తిరిగి ప్రదర్శించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల అభిరుచి కలిగించడం కోసం ఈ సైన్స్ ఎక్స్పోను ఏర్పాటు చేస్తున్నట్లు తొలి అడుగు ఫౌండేషన్ పేర్కొంది. విద్యార్థులు ఎగ్జిబిట్స్ను రూపొందించుకోవడానికి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సహకరించవలసిందిగా కోరుతున్నట్లు ఆయన తెలిపారు. కొత్తగూడెం సింగరేణి స్కూల్ వేదిక గా జరుగుతాయని తెలిపారు.
Aadhaar | ఆధార్ కార్డుల కోసం రోడ్డెక్కిన మహిళ.. నలుగురు పిల్లలతో కలిసి జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట ధర్నా
Langar House | లంగర్ హౌస్లో ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేత
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం