అంజనాపురం పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, విద్యా సామగ్రి పంపిణీ
సుజాతనగర్ మండలం పాత, కొత్త అంజనాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, విద్యానగర్–కొత్తగూడెం ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థులకు రూ.20 వేల విలువైన స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ తదితర విద్యా సామగ్రిని...
చుంచుపల్లి, జూలై 14 : సుజాతనగర్ మండలం పాత, కొత్త అంజనాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, విద్యానగర్–కొత్తగూడెం ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థులకు రూ.20 వేల విలువైన స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ తదితర విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కీ.శే.పోక వెంకటేశ్వర్లు, వెంగమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు పోక శ్రీనివాసరావు, కోడలు సృజన (అమెరికా) దంపతులు ఆర్థిక సహకారం అందించగా, అమర్ ఎంటర్ప్రైజెస్ ప్రతి విద్యార్థికి రెండు పెన్నులు ఉచితంగా అందించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు విద్యార్థుల కోసం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. సెక్రటరీ సురేష్ కుమార్ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఈఓ ఎల్. లీల, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

