Sammakka Saralamma jathara | చండ్రుగొండ, ఫిబ్రవరి 10 : ఈనెల 12 నుండి జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ బాధ్యులు భక్తులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ శివారులో శ్రీ సమ్మక్క సారలమ్మ 25వ వార్షికోత్సవము (జాతర మహోత్సవం) జరుగనుంది.
మహోత్సవం ఈ నెల 12వ తేదీ నుండి 15వ తేదీ వరకు బెండాలపాడు శివారు ప్రాంతంలో ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలతో ఘనంగా జరగనుంది. గిరిజన ఆదివాసీల ఆరాధ్య దైవమైన నిత్యం పూజిస్తున్న వనదేవతలు అయిన సమ్మక్క సారలమ్మ ల గద్దెల నందు జాతర జరగనుంది. మినీ మేడారం జాతరను తలపించేలా సమ్మక్క సారక్క జాతర కమిటీ, భక్త బృందం, గ్రామ పెద్దలు అంగరంగ వైభవంగా తగిన ఏర్పాట్లు చేశారు.
Power Demand | తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. మండుతున్న ఎండలే కారణం..!
KTR | హిమాయత్‌నగర్ చౌరస్తాలో గులాబీ జెండా ఎగురవేసిన కేటీఆర్