బూర్గంపహాడ్, జూన్ 29 : మండల కేంద్రమైన బూర్గంపహాడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సోమవారం సహకార్ సే సమృద్ధి వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. తొలుత సంఘం ఉపాధ్యక్షుడు ఆవుల నాగిరెడ్డి సొసైటీ కార్యాలయం ఎదుట జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి, క్షేత్రస్థాయిలో సహకార సొసైటీని విస్తరింపచేయడానికి, ఉత్పాదకత, లాభదాయకతను పెంచడానికి ప్రభుత్వం వారోత్సవాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సహకార బ్యాంకులను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఈవో ప్రసాద్, సొసైటీ సిబ్బంది తిరుపతిరెడ్డి, సొసైటీ పాలకవర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.