రుద్రంపూర్, సెప్టెంబర్ 12 : చుంచుపల్లి మండలం రుద్రంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులు అభిలాష, స్వరాజ్, యశ్విక్, హస్విత్ సాయి ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కవిత, కోచ్ పొన్నాల పృథ్వీరాజ్ తెలిపారు. సెయింట్ జేవియర్స్ హైస్కూల్లో నిర్వహించిన సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ ఎంపిక ట్రయల్స్‌లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వారి ఆటతీరును పరిగణనలోకి తీసుకుని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. 11వ రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలు సెప్టెంబర్ 11 నుండి 13వ తేదీ వరకు మంచిర్యాల జిల్లాలో జరుగుతున్నాయి. ఈ పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన 11 జట్లు పాల్గొంటున్నాయి. విద్యార్థుల ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.బాలాజీ, ఏరియా జనరల్ మేనేజర్ సి.హెచ్.వెంకటరమణ, రుద్రంపూర్ సర్పంచ్ కేస్లీ, వైస్ సర్పంచ్ తోట రాజు, రజాక్, యాకయ్య, పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.