Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ మొబైల్లో డజన్ల సంఖ్యలో పోర్న్ వీడియోలు.. ఫోన్, సిమ్ స్మగ్లింగ్ కేసులో అయిదుగురి అరెస్టు
Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ మొబైల్ ఫోన్లో డజన్ల సంఖ్యలో పోర్న్ వీడియోలు ఉన్నట్లు ఫోరెన్సిక్ విచారణలో తేలింది. అతని పెన్‌డ్రైవ్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఇక జైలుకు ఫోన్, సిమ్ స్మగ్లింగ్ చేసిన కేసులో అయిదుగుర్ని అరెస్టు చేశారు.
బెంగుళూరు: మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ మనువడు.. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) అత్యాచారం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే జైలులో అతని వద్ద ఇటీవల ఓ మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు. ఆ ఫోన్లో డజన్ల సంఖ్యలో అశ్లీల వీడియోలు ఉన్నట్లు ఇవాళ పోలీసులు వెల్లడించారు. అతని వద్ద ఉన్న పెన్ డ్రైవ్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉన్నట్లు గుర్తించారు. ఆగస్టు 11వ తేదీన పరప్పాన అగ్రహారం సెంట్రల్ జైలులో అకస్మిక తనిఖీలు చేసి ప్రజ్వల్ నుంచి ఫోన్ సీజ్ చేశారు. దాన్ని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు.
సెంట్రల్ జైలులో ప్రజ్వల్ వద్ద ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్నట్లు గుర్తించారు. అతను జైలు నుంచి ఫోన్లో మరికొరితో మాట్లాడడాన్ని గమనించారు. అయిదు గంటల పాటు సెర్చ్ చేపట్టి, రేవణ్ణ బరాక్ నుంచి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సీఈఎన్ పోలీసు స్టేషన్ దర్యాప్తు నిర్వహించింది. ఆ ఫోన్లో డజన్ల సంఖ్యలో పోర్న్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ఫోన్ తనది కాదు అని, ఇతరులు కూడా జైలులో ఫోన్ వాడుతారని, కానీ రొటేషన్ పద్ధతిలో ఆ ఫోన్ తన వద్దకు వచ్చినట్లు రేవణ్ణ చెప్పారు.
తానేమీ పోర్న్ వీడియోలు డౌన్లోడ్ చేయలేదన్నాడు. అతని వద్ద ఉన్న నోట్‌బుక్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల ఫోన్ నెంబర్లు ఉన్నాయి. అనుమతి లేకున్నా కొందరి వ్యక్తులతో ఫోన్లో మాట్లాడినట్లు రేవణ్ణ అంగీకరించాడు. ఓ మహిళతోనూ అతను ఫోన్లో టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఆ ఫోన్ కాంటాక్ట్‌లో, కాల్ హిస్టరీలో ఉన్న నెంబర్లకు త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.
మొబైల్ ఫోన్‌ను ఖరీదు చేసిన అయిదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆ ఫోన్‌ను, సిమ్‌ను జైలుకు పంపిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ప్రిజన్ వార్డెన్ ద్వారా ఆ ఫోన్ జైలులోకి వెళ్లినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇక సిమ్ కార్డును మాత్రం ఓ అండర్‌ట్రయల్ ఖైదీ జైలు లోపలికి తీసుకెళ్లినట్లు తెలిసింది. సెప్టెంబర్ 8వ తేదీన రేవణ్ణ, రాయ్‌ని పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 10న కోర్టు ఆదేశాల ప్రకారం ఆ ఇద్దర్నీ సెంట్రల్ జైలుకు తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

