Anushka Sharma-Virat Kohli | ‘హనుమాన్ అంశ్’ చిత్రం భారీ విజయవంతం కావడంతో మేకర్స్ దీనికి సీక్వెల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రెండో భాగంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబాకు భక్తులుగా ఉన్న ప్రముఖుల పాత్రలు లేదా క్యామియోలు ఉండే అవకాశం ఉందని నిర్మాత నమ్రతా సింగ్ తాజాగా తెలిపారు. అయితే ఇందులో భాగంగానే ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలతో పాటు హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్‌ను కూడా సంప్రదించినట్లు ఆమె వెల్లడించారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదని, కొందరు ప్రముఖులకు ఇప్పటికే ఈ సినిమా గురించి తెలుసని ఆమె తెలిపారు.
మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి రూ.192 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడంతో సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ కథ నీమ్ కరోలీ బాబా జన్మస్థలమైన ఫిరోజాబాద్‌తో పాటు ఆగ్రా, మధుర వంటి ప్రాంతాల్లో ఆయన జీవిత విశేషాలను అన్వేషించనుంది. ఇక సీక్వెల్లో స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్ వంటి అంతర్జాతీయ ప్రముఖులపై బాబా ప్రభావం గురించి చూపించనున్నట్లు మేకర్స్ తెలిపారు.