Sri Ganesh | తెలంగాణలో బైక్ ట్యాక్సీలుగా నడిచే వాహనాలకు ఇకపై పసుపు రంగు నంబర్ ప్లేట్లు తప్పనిసరి కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. పసుపు రంగు నంబర్ ప్లేట్ ఉంటేనే బైక్లను ట్యాక్సీలుగా నడిపేందుకు అనుమతి లభించనుంది. ఈ నిర్ణయం తీసుకుంటే బైక్ ట్యాక్సీలతో జీవనం సాగిస్తున్న వేలాది మందికి ఆర్థికంగా పెను భారం కానుంది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ అసెంబ్లీలో చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్లో గాలి కాలుష్యం ఎంతుందో మనకు తెలుసు. రోజు రోజుకీ ఎక్కువమంది బైకులు కొనుక్కోవడం కావొచ్చు.. కార్లు కొనుక్కోవడం కావొచ్చు. ఈ మధ్య కాలంలో ఎక్కువమంది స్విగ్గీ, జొమాటో, క్యాబ్లపై ఆధారపడి చాలా మంది బండ్లు కొంటున్నారు.. దీంతో ఎక్కువ బండ్లు రోడ్డుపైకి వచ్చి ఎంత కాలుష్యం పెరుగుతందో మనందరికీ తెలుసు. ప్రజలు శ్వాస తీసుకునేందుకు కూడా ఇబ్బంది పెడే పరిస్థితి ఉందన్నారు.
స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, క్యాబ్లపై ఆధారపడి చాలా మంది బండ్లు కొంటున్నారు
దీని వల్ల హైదరాబాద్లో గాలి కాలుష్యం ఎక్కువ అవుతుంది
– కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ https://t.co/VCbRdk22z6 pic.twitter.com/8mjHh197rO
— Telugu Scribe (@TeluguScribe) September 12, 2026
Brahmotsavams | ఏపీ సీఎంకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత