– బీఆర్ఎస్ ఉద్యమ నేత దిండిగాల రాజేందర్
ఇల్లెందు, ఏప్రిల్ 23 : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఉద్యమ నేత దిండిగాల రాజేందర్ అన్నారు. గురువారం ఇల్లెందు బస్ డిపో ముందు గత రెండు రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న సమ్మె, నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా పట్టణ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో హామీ ప్రకారం వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అలాగే గత రెండు రోజులుగా ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె, నిరసనను ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లను పెట్టి ఆర్టీసీ బస్సులను నడిపించుట సరికాదన్నారు. ఆర్టీసీ కార్మిక నాయకులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని సమస్యలపై పోరాడుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సిలివేని సత్యనారాయణ, ఎస్ రంగనాథ్, ఇల్లెందు పట్టణ అధ్యక్షులు అబ్దుల్ జబ్బర్, ఉపాధ్యక్షులు అబ్దుల్ నబీ, డేరంగుల పోషం, శ్రీకాంత్, మూలగుండ్ల ఉపేందర్, వసంతరావు, శ్రీను, ఇమ్రాన్, మునిగంటి శివ, శ్రీను పాల్గొన్నారు.

‘ఎన్నికల హామీ ప్రకారం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి’