RTC Buses | ఆర్టీసీ కార్మికుల సమ్మెతో డిపోల్లోనే బస్సులు.. ధర్నాతో అద్దె బస్సుల హవా
RTC Buses | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీ ఇచ్చి రెండేళ్లు దాటుతున్న నేటికి హామీ అమలు కావడంతో కార్మికులు ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు.
RTC Buses | భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 22 : ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంతో కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. సమ్మె ఎఫెక్ట్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం, ఇల్లందు డిపోల నుండి ఆర్టీసీ బస్సులు కదల్లేదు.. ఉదయం 7 గంటలకే ఆర్టీసీ కార్మికులతో పాటు కార్మిక సంఘ నాయకులు బస్ డిపోల ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఒక్క బస్సును కూడా డిపో నుండి కానివ్వకుండా చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీ ఇచ్చి రెండేళ్లు దాటుతున్న నేటికి హామీ అమలు కావడంతో కార్మికులు ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు. ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వం ఆ డిపోల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రైవేట్ బస్సులను తిప్పే ప్రయత్నం చేస్తుంది. రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు బస్సులను డ్రైవర్లను ఏర్పాటు చేసి నడిపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ బస్ ల లో ప్రయాణికులు వెళ్లడం లేదు.
ప్రైవేట్ బస్సుల్లో అద్దె బస్సుల ఓనర్లు ప్రయాణికుల వద్ద ఇష్టం వచ్చినట్లు చార్జీలు వసూలు చేసి జేబులో వేసుకుంటున్నట్లు సమాచారం, రేపటినుండి మరింత ఉధృతంగా సమ్మె జరగనున్నట్లు ఆర్టిసి కార్మిక సంఘాలు చెప్తున్నారు.

Read Also :
Kailsas Bapu Kote | కుమార్తె కలుగాలన్న ఆశ నెరవేరకపోవడంతో ఆ దంపతులు ఏం చేశారో తెలుసా..?
Telangana High Court | పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే!
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

