BRS Party | భద్రాచలం : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ పిలుపు మేరకు మిర్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం మండల బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, రేపాక పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ డివిజన్ అధికారి దామోదర్ రావుకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ఏజెన్సీలో గోదావరి పరివాహక ప్రాంతంలో మిర్చి ఆధారిత రైతాంగం ఎక్కువగా ఉందని ఆరుగాలం కష్టపడి వరదల కారణంగా నష్టపోయి మిరప పంటను దిగుబడి చేస్తే ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు. మిర్చికి క్వింటాకు రూ.30 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కొల్లం జయ ప్రేమ్ కుమార్, అయినాల రామకృష్ణ, కొండవీటి తమాషాయ్య, కావూరి సీతామహాలక్ష్మి. పితాని భానుప్రసాద్, మురలా డానియల్ ప్రదీప్, ఇమంది నాగేశ్వరరావు, కొలిపాక శివ ప్రియాంక, రాణి, తదితరులు పాల్గొన్నారు.
Singer Kalpana | వెంటిలేటర్‌పై చికిత్స.. కల్పన హెల్త్ బులెటిన్ విడుదల
Crazy Star Award | రెబ్బెనకు చెందిన దేవర వినోద్‌కు క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
Inter student | పోలీసుల ఔదార్యం.. ఇంటర్ విద్యార్థిని సకాలంలో పరీక్ష కేంద్రానికి తరలింపు