ఈ 25న జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలి
కొత్తగూడెంలోని కమ్మవారి కళ్యాణ మండపంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 25న జరిగే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని పాల్వంచ 38వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ బత్తుల మధుచంద్ పిలుపునిచ్చారు.
– పాల్వంచ బీఆర్ఎస్ కార్పొరేటర్ బత్తుల మధుచంద్
– ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల సాధనపై సమాలోచనలు
పాల్వంచ, జూలై 23 : కొత్తగూడెంలోని కమ్మవారి కళ్యాణ మండపంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 25న జరిగే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని పాల్వంచ 38వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ బత్తుల మధుచంద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సమావేశానికి బీఆర్ఎస్ కంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏనుగుల రాకేష్ రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ఈ సమావేశాన్ని విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు శంకుబాపన అనుదీప్, పాల్వంచ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు జూపెల్లి దుర్గాప్రసాద్, అల్లి సాయికిరణ్, షారుఖ్, ఆర్ఎంపీ శ్రీను, శ్రీకాంత్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

