రుద్రంపూర్, సెప్టెంబర్ 11 : ‘సివిల్ అధికారులు స్పందించి ఉంటే కార్మికుడి ప్రాణం దక్కేదా?’ అంటూ నమస్తే తెలంగాణ ఆన్లైన్లో ప్రచురితమైన కథనానికి సింగరేణి కొత్తగూడెం ఏరియా సివిల్ అధికారులు స్పందించారు. ఈ నెల 6న రాత్రి విధులకు వస్తున్న రుద్రంపూర్ సివిల్ డిపార్ట్మెంట్ పంప్ ఆపరేటర్ ఎస్. కోటేశ్వరరావు కారు ఢీకొని మృతి చెందిన నేపథ్యంలో ఈ కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన యాజమాన్యం ఫిల్టర్ బెడ్ వద్ద రోడ్డు పనులను వెంటనే ప్రారంభించింది. పనుల ప్రారంభంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ పనులు సకాలంలో పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.