ఇల్లెందు, ఏప్రిల్ 1 : ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని అపహస్యం పాలు చేస్తున్నాడని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృధ్వీ అన్నారు. ప్రజలు, ప్రజాస్వామిక వాదులంతా ఈ చర్యలను ఖండించాలని విద్యార్థి సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నట్లు కోరారు. అర్థరాత్రి సమయంలో విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయాడాన్ని ఆయన తీవ్రంగా నిరసిస్తూ మంగళవారం మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాలనలో ఏ కారణం లేకుండానే నిర్భందిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల ఆందోళన నేపథ్యంలో ఇల్లందులో బీఆర్ఎస్వీ నాయకులు గిన్నెలు రాజేశ్, హరి ప్రసాద్, చాంద్‌పాషా, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ, రాష్ట్ర కార్యదర్శి (చంద్రన్న వర్గం) సాంబ, ఇల్లందు పట్టణ కార్యదర్శి ఎ.పార్థసారథిని పోలీసులు ముందుస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.