రామవరం, ఆగస్టు 07 : కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాంను హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ కొరిమి రాజకుమార్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు పలు కార్మిక సమస్యలపై చర్చలు జరిపారు. అందులో భాగంగా ప్రథమంగా సి&ఎండి, డైరెక్టర్ల స్ట్రక్చర్ సమావేశంలో ఒప్పుకున్న పలు కార్మికుల సమస్యలపై 15 రోజుల్లో సర్కులర్లు యాజమాన్యం విడుదల చేస్తుందని తెలిపారు. కాగా మైనింగ్, ట్రేడ్స్ మెన్ ఉద్యోగులు మెడికల్ అన్‌ఫిట్ అయితే వారికి సర్ఫేస్ లో సుటబుల్ జాబ్ ఇవ్వడానికి, ఈపి ఆపరేటర్లకు. D టు C, C టు B గ్రేడ్ వారికి వెకెన్సీస్ తో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలన్నారు.
అదే విధంగా మారుపేర్లు విషయంపై అడ్వకేట్ జనరల్ దగ్గర ఉన్నందున యాజమాన్యం మారు పేర్ల సమస్యని వెంటనే పరిష్కారం అయ్యేలా ప్రభుత్వంతో పాటు అడ్వకేట్ జనరల్‌ను సంప్రదించి సమస్యను పరిష్కరించి కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అదేవిధంగా ఇటీవల జరిగిన మెడికల్ బోర్డులో 55 మంది బోర్డుకి హాజరు అవ్వగా ఐదుగురుని మాత్రమే అన్‌ఫిట్ చేశారని, వారికి మళ్లి మెడికల్ బోర్డు పెట్టాలని కోరుతూ మెమొరాండం అందించారు. ఈ విషయంపై సి&ఎండి సానుకూలంగా స్పందించినట్లు వారు వెల్లడించారు.